13 August, 2026 | 1:59 AM

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు స్టే

13-08-2026 12:45 AM
  1. చట్టసభల్లో తీర్మానం లేకుండా అమలు
  2. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం నుంచి అమలులో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించింది. ఈ పథకాలపై చట్టసభల్లో తీర్మానం చేయలేదని, కేవలం జీవోల ద్వారా మాత్ర మే అమలు చేస్తున్నారంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. ఈ పథకాలు చెల్లవని విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇదే పిటిషన్‌పై గతంలోనే హైకోర్టు విచారణ చేపట్టింది.

ఆ విచారణలో  కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసి, ఇప్పటికీ నాలుగు వారాలైనా ప్రభుత్వం కౌం టర్ దాఖలు చేయలేదు. ఇదే విషయాన్ని న్యాయవాది గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు ఈ రెండు పథకా లపై స్టే విధించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.