13 August, 2026 | 3:07 AM

పుస్తె, మట్టెల పంపిణీ

13-08-2026 01:56 AM

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 12 (విజయక్రాం తి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని 24 వ వార్డులో నివాసం ఉంటున్న పోచయ్య సద్గుణ దంపతుల కుమార్తె వివాహానికి 10000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఎల్లంపేట్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి నుండి నేటివరకు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన నూతనంగా పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కూతుళ్లకు పుస్తే మట్టేలను అందించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు.ఈ సందరంగా వారు మాట్లాడుతూ తన కూతురి పెళ్లికి పుస్తే మట్టేలను అందించిన బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.