1 July, 2026 | 8:13 PM

Breaking News

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •  

నిర్మల్లో ఘనంగా ‘వారసత్వ సంబురాలు’

12-04-2026 12:21 AM

ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి

నిర్మల్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లో రచయితలు విశేషంగా సాహిత్య సృష్టి చేయడం అభినందనీయమని, మహిళా రచయితలు ముందుకు రావడం గర్వకారణమని రిటైర్డ్ ఐఏఎస్, మాజీ రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ పార్థసారథి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

శనివారం నిర్మల్ పట్టణంలోని సిటీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో ‘వారసత్వ సంబురాలు’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా చరిత్ర, వైద్య వృత్తి, సంస్కృతి, సాంప్రదాయాలపై జిల్లా రచయితలు రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. అ నంతరం వైద్యులను శాలువాలతో సన్మానిం చి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్య క్రమం లో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా వైద్యులు, కార్యక్రమ నిర్వాహకులు, పాల్గొన్నారు.