1 July, 2026 | 7:10 PM

Breaking News

సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •  

టీఆర్పీ సింగరేణి కాలనీ అధ్యక్షుడిగా డేగావత్ రవి

12-04-2026 12:21 AM

నియామక పత్రం అందజేసిన తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తు న్న తరుణంలో, సింగరేణి కాలనీ టీఆర్పీ అధ్యక్షుడిగా దేగవత్ రవిని పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నియమించారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఆర్. భావన రఘు ఆధ్వర్యంలో తీన్మా ర్ మల్లన్న చేతుల మీదుగా రవి నియామక పత్రాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా దేగవత్ రవి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మల్లన్నకి, జిల్లా ఇన్‌చార్జి భవన వెంకటేష్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సింగరేణి కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో సింగరేణి కాలనీలో టీఆర్పీ జెండా ఎగురవేస్తానని రవి ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో  హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ రంగరాజు అనిల్ కుమార్ పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గౌడ్, కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీఆర్, వివిధ డివిజన్ల జనరల్ సెక్రటరీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.