24 March, 2026 | 2:34 AM

గరీబోళ్లను ఆదుకుంటేనే ఆత్మ సంతృప్తి

23-03-2026 09:57 PM

మోహన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పవన్ బాబు

జవహర్ నగర్,(విజయక్రాంతి): గరీబోళ్లను ఆదుకుంటేనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని పరోపకారమే హితం శరీరమని పరులకు ఉపకారం చేస్తేనే మానవ జన్మ సార్థకమవుతుందని మోహన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పవన్ బాబు పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ గిరి ప్రసాద్ నగర్ కాలనీలో నివసించే పేద మహిళ దివ్యాంగురాలు ప్రమీల కూతురు జ్యోతికి ఈనెల 25వ తేదీన పెళ్లి నిశ్చయమవ్వగా తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ ఆధ్వర్యంలో మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ను ఆర్థిక సహాయం కోసం సంప్రదించగా స్పందించిన ట్రస్ట్ చైర్మన్ పవన్ బాబు సినీ నటుడు మోహన్ బాబు కోఆర్డినేటర్ భాను రెడ్డిని సంప్రదించగా స్పందించిన వాళ్లు జ్యోతి పెళ్లికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న ట్రస్ట్ చైర్మన్ పవన్ బాబుని ఆర్థిక సహాయాన్ని అందించిన సినీ నటులు మోహన్ బాబు, భాను రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, జ్యోతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.