2 March, 2026 | 11:05 PM

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి చేయూత

02-03-2026 09:12 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలో దోర్నాల మల్లయ్య గుడిసె రెండు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. విషయం గ్రామానికి చెందిన శ్రీగాద స్వామికి తెలియడంతో ఆయన స్పందించి తన వంతు సహాయంగా రూ.3,000 నగదుతో పాటు 50 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామగల్ల నాగరాజు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇటువంటి సహాయం మానవత్వానికి నిదర్శనమని గ్రామస్తులు ప్రశంసించారు.