పొంగి ప్రవహిస్తున్న చింతల బోరి వాగు
30-07-2026 03:43 PM
నిలిచిపోయిన రాకపోకలు.
బోథ్, జులై 30 (విజయ క్రాంతి): సోనాల మండలంలో కురిసిన భారీ వర్షానికి చింతల బోరి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. అయితే ప్రాజెక్టు అలుగు నుండి పారే నీరు వల్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పార్టీ బి గ్రామం సందర్భంలో రోడ్డుపై ఉన్న లో లెవెల్ వంతెన పై నుండి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటల నుండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలకు మండల కేంద్రంతో సంబంధాలు నిలిచి పోయాయి. దీంతోమండల ప్రజలు వాగు వద్దే ఉండిపోయారు. వాగు ఉదృతి తగ్గేంతవరకు అక్కడే ఉండాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. వంతెన నిర్మాణాన్ని చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాల్సి ఉన్న అవసరం ఉందని అంటున్నారు.






