హైదరాబాద్‌లో భారీ వర్షం.. నైరుతి ఆగమనం మరింత ఆలస్యం
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం(Heavy rain) దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్ లో చిరుజల్లులు పడ్డాయి. టోలీచౌకి, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్, ఎల్‌బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, హయాత్‌నగర్, సరూర్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఘట్ కేసర్ లో వడగాళ్ల వాన పడుతోంది.
మెదక్ లో 20 నిమిషాల పాటు భారీ వర్షం.. తడిసిపోయిన ధాన్యం
మెదక్ జిల్లాలో 20 నిమిషాల పాటు ఈదురుగాలుతో కూడిన జోరు వాన కురిసింది. కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షానికి గంగినేని థియేటర్ వద్ద రోడ్ జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ర్యాలమడుగు గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నేలకొరిగింది. మంభోజిపల్లి గ్రామంలో 3 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయని అధికారులు తెలిపారు. మెదక్ మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. మగ్దుంపూర్ కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన 2 లారీల వడ్లు తడిపోయాయి. తూకం వేసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందారు.
నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం
నైరుతి రుతుపవనాల ఆగమనం మరింత ఆలస్యం కానుంది. తొలుత ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేశారు. నాలుగైదు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకే అవకాశముంది. ఈ ఏడాది మాన్ సూన్ సీజన్ పై ఎల్ నినో ప్రభావం పడనుంది. రాష్ట్రంలోకి జూన్ 5 నుంచి 10 తేదీల్లో నైరుతి ప్రవేశించే అవకాశముంది వాతావరణ శాఖ పేర్కొంది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ లో ఎల్ నినో ప్రభావం కనిపించనుంది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదయ్యే సూచన కనిపిస్తోందని వాతావరణ శాఖ ప్రకటించింది.






