28 May, 2026 | 11:42 AM

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

28-05-2026 10:50 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఈద్గా వద్ద ముస్లింలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గో రక్షణ కోసం తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గోవును జాతీయ జంతువుగా ప్రకటించి సంరక్షించాలని కోరారు. బక్రీద్ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లింలు సామూహిక ప్రార్ధన నిర్వహించిన అనంతరం, గోరక్షణ కోసం సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.