30 July, 2026 | 9:52 AM

దశదినకర్మలకు బియ్యం అందించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు

30-07-2026 09:06 AM

గుండాల, (విజయక్రాంతి): మండల బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, నిట్ట వెంకన్న తండ్రి నిట్ట సమ్మయ్య గతవారం మృతి చెందగా నిట్ట సమ్మయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు ఆదేశాలతో పరామర్శించి, పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటు 15 కేజీల మంచి నూనెను అందించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తుందని అన్నారు. ఆపద ఉందంటే పార్టీ ముందు వరుసలో ఉండి వారి కష్టాన్ని తీర్చడంలో బాసటగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు గడ్డం వీరన్న, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, ఉప సర్పంచ్ తాటి పాపారావు, పొంబోయిన సుధాకర్, గడ్డం రామకృష్ణ, చేబోతు రంజిత్ కుమార్, వాంకుడోత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.