30 July, 2026 | 9:25 AM

పార్వతి బ్యారేజ్‌లో ఫ్రీ ఫ్లో, గేట్లు ఎత్తివేత

30-07-2026 08:51 AM

 దిగువకు 26 వేల క్యూసెక్కులు విడుదల

మంథని, జూలై 30 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి వరద నీరు పెరుగుతోంది. దీంతో పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి (సుందిళ్ల) బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహం ఫ్రీ ఫ్లో  పరిస్థితిలో కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను వచ్చినట్లే అధికారులు దిగువకు వదులుతున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి బ్యారేజ్ వద్ద వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 ప్రస్తుత నీటి మట్టం 119.84 మీటర్లు (పూర్తి స్థాయి నీటి మట్టం: 130.00 మీటర్లు).

 ప్రస్తుత నీటి నిల్వ: 8.83 టీఎంసీలు

 ఇన్‌ఫ్లో (వస్తున్న నీరు): 26,141 క్యూసెక్కులు

  ఔట్‌ఫ్లో (వదులుతున్న నీరు): 26,141 క్యూసెక్కులు

బ్యారేజ్‌లోకి వస్తున్న 26,141 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తుండటంతో ప్రవాహం సునాయాసంగా కొనసాగుతోంది.

గోదావరి నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, నది తీరంలో నివసించే వారు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎవరూ నది లోపలికి వెళ్లవద్దని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.