వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి
రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్
చేగుంట ,జూలై 30 (విజయక్రాంతి): వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ అన్నారు.చేగుంట మండలం చందాయిపేట్ లోని రైతు వేదికలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు, సాంకేతిక సలహాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు, ఈ కార్యక్రమం లొ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా,మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్,పంచాయతీ సెక్రటరీ కృష్ణ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, వార్డ్ సభ్యులు బుడ్డ మహేష్, వివిధ షాప్ ల ఫర్టిలైజర్ షాప్ లో యజమానులు శ్రీకాంత్, రాజు, బాలకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారి దివ్య, భవాని, యాదగిరి,రైతులు ఆనందాస్ ఆంజనేయులు, బాస రాజు, శోభన్, ఆక్బార్, యూసుఫ్,తదితరులు పాల్గొన్నారు.






