నిండుకుండలా ఎగువమానేరు జలాశయం
08-08-2026 07:59 PM
- ఆనందంలో అన్నదాతలు
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 31అడుగులు (2 టీఎంసీలు )కాగా ప్రస్తుతం 30అడుగులకు నీరు చేరింది. మరో 1అడుగు చేరితే మత్తడి దూకే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లా పల్వాంచ వాగు ద్వారా సుమారు 6వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు కు వచ్చి చేరుతుంది. దీంతో ఆయకట్టు పరివాహక ప్రాంత ప్రజలు అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






