క్రీడలతోనే ఆరోగ్యం.. అవకాశాల దారి
ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): విద్యతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారుతారు.. చదువుల్లో రాణించిన వారికి ఎలా అవకాశాలు వస్తాయో, క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు పేర్కొన్నారు.
సోమవారం అంబర్‌పేట మున్సిపల్ మైదానంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా కొనసాగిన సమ్మర్ క్యాంప్ కోచింగ్ కార్యక్రమంలో వీహెచ్ పాల్గొని మాట్లాడారు. క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయన్నారు.
ముఖ్యంగా మహిళలు విద్యతో పాటు క్రీడల్లో పాల్గొనడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్, పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, పంజాల ధనంజయ్ గౌడ్, ఆర్ జై హింద్, సద్గురు, అరవింద్ గౌడ్, రామ్మోహన్ రావు, వెంకటేష్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, కోటం అనిల్, రావుల సుధాకర్, తెలంగాణ కోచ్ విజయభాస్కర్, యాదగిరి గౌడ్ రజనీకాంత్ గౌడ్, విజయ్ కృష్ణ, రాకేష్, జావిద్, కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






