9 June, 2026 | 2:45 AM

అనుకున్నది సాధించేవాడే హిట్లర్

09-06-2026 01:14 AM
  1. హైడ్రా సంకల్పం గురించే సీఎం రేవంత్ హిట్లర్ పదం ఉపయోగించారు 
  2. పరిపాలనా తత్వశాస్త్రం, పాలనా దక్షతను ఉద్దేశించే వ్యాఖ్యలు 
  3. హిట్లర్ హింసావాదాన్ని కాంగ్రెస్ సమర్థించదు.. 
  4. మా డీఎన్‌ఏలోనే ఆ వాదంపై వ్యతిరేకత ఉంది.. 
  5. బీఆర్‌ఎస్ నేతలవి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు..
  6. ప్రజాస్వామిక విలువల గురించి కేటీఆర్ మాట్లాడటం గురువింద సామెత చందం 
  7. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ‘బెంగళూరులో ఇటీవల జరి గిన ‘ది హిందూ హడిల్’ కాన్ క్లేవ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఉద్దేశంతో హిట్లర్ అన్న పదం ఉపయోగించారో అర్థం చేసుకోకుండా బీఆర్‌ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు. అనుకున్నది సా ధించే వాడే హిట్లర్ అన్న అర్థంలో సీఎం ఆ పదం ఉపయోగించారు. పరిపాలనా తత్వశాస్త్రం, పాలనాదక్షత గు రించి సీఎం మాట్లాడారే తప్ప, హిట్లర్ హింసా సిద్ధాంతాలను కాదు. ఆ వ్యా ఖ్యలను అర్థం చేసుకునేంత ప్రాథమిక మేధో పరిపక్వత బీఆర్‌ఎస్ నేతలకు లేదు.

సీఎం వ్యాఖ్యలు కబ్జాదారుల గుండెల్లో హైడ్రా గుబులు పుట్టిస్తున్నాయి. అది ఓర్వలేకే కొంందరు దొం గ ఏడుపులు ఏడుస్తున్నారు’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నిప్పులు చెరిగారు. హైదరా బాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో సో మవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. సీఎం ప్రస్తావిం చింది హైడ్రా పనుల అమలు వేగం గురించి మాత్రమేనని, హిట్లర్ హింసా సిద్ధాంతాలను కాదని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల చె రువులు, కుంటలను కబ్జాదారుల నుం చి కాపాడాలంటే హిట్లర్ వంటి సంక ల్పం ఉండాలని సీఎం చెప్పాలనుకున్నారని వెల్లడించారు. రాష్ట్ర రాజధానిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని, ప్రజలకు పరిశుభ్రమైన నీరు, గాలి అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. గాంధీజీ అహింస సిద్ధాంతం గురించి చెప్పారే తప్ప, దొంగతనాలు, కబ్జాలు జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోమనలేదని మంత్రి పేర్కొన్నారు.

హైడ్రా చట్టపరిధిలోనే పనిచేస్తోందని, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నోటీసులు ఇస్తోందని, కబ్జాదారులకు కొమ్ము కాయకుండా, వారితో కుమ్మక్కు అవ్వకుండా ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నదని ఉద్ఘాటించారు. హిట్లర్ క్రూరత్వాన్ని, హింసాత్మక ఫాసిజాన్ని ఎప్పటికీ కాంగ్రెస్ సమర్థించదని, అది తమ డీఎన్‌ఏలో నే లేదని వివరించారు.

ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులకు సహకరించాలే తప్ప, చిల్లర వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కథానాయకుడిగా ‘హిట్లర్’ అనే సిని మా కూడా వచ్చిందని, సమాజంలో క్రమశిక్షణను ఆశించే ఉద్దేశంతో సాధారణ జనబా హుళ్యంలో ఈ పదాన్ని వాడుతుంటారని గుర్తుచేశారు.

బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు

జాతిపిత గాంధీజీ, రాజ్యాంగ నిర్మాత అం బేద్కర్ తమకు ఆదర్శమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించుకోవడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని మంత్రి ఎద్దేవా చేశారు. కేటీఆర్ నోట ప్రజాస్వామ్య విలువలు వింటుంటే ‘గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదు’ అన్న సామెత గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాటు సచివాలయానికి, ప్రగతి భవన్‌కు ఇనుప కంచెలు వేసి సామాన్య జనానికి ప్రవేశం లేకుండా చేసిన వారు, ఇప్పుడు వేదాలు వల్లెవేస్తుండటం విడ్డూరమని దుయ్యబట్టారు.

ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన వారు, ఫోన్‌ట్యాపింగ్ చేసిన వారు, టీజీపీఎస్సీ పేపర్లను పప్పూ బఠాణీల్లా మార్కెట్లో అమ్మకానికి పెట్టి లక్షలాది నిరుద్యోగులకు అన్యాయం చేసిన వారు ఇప్పుడు హితబోధ చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ‘తాపీ మేస్త్రీకి తలపోటు వస్తే.. గోడ కూల్చినట్టుంది’ అన్న చందంగా కేటీఆర్ వ్యవహార శైలి ఉందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 10 సీట్లు కూడా రావవని జోస్యం చెప్పా రు.

బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం మానుకోవాలని, లేదంటే మున్ముం దు ప్రతిపక్ష హోదా అయినా రాదని ఎద్దేవా చేశారు. వారి పాలనలో చోటుచేసుకున్న తప్పులన్నింటినీ, తమ ప్రభుత్వం సరి చేస్తుం టే, తమపై నిందలు వేయడమేంటని మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణిస్తుంటే బీఆర్‌ఎస్ విసిగిపోతుందని చురక లంటించారు.

ప్రతిపక్ష పాత్ర నిర్వహించమని ప్రజలు సూచిస్తే, బీఆర్‌ఎస్ నేతలు ఆ పని సరిగా చేయలేకపోతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాలో భూములు రేట్లు తగ్గాయని మాజీ మంత్రి హరీష్‌రావు తప్పు డు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలు కృత్రి మంగా భూముల ధరలు పెంచారని, సామాన్యులు ఇళ్లు కట్టుకోవాలంటే భయపడేవారని పేర్కొన్నారు. రైతులు గురించి మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

రైతులకు మేలు చేయడానికే రైతు డిస్కం తీసుకువస్తున్నామని, ఉచిత విద్యుత్‌ను ప్రవేశపె ట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ప్రభు త్వం ఎన్ని ఇబ్బందులు పడినా రైతును మాత్రం ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని వివరించారు.

బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 30 శాతంమైనా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది చనిపోతే కేవలం 400 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందించి, మిగిలిన 800 మందిని బీఆర్‌ఎస్ పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండున్నర ఏళ్లలోనే ఏకంగా 70 శాతం హామీలను నెరవేర్చిందని ధీమా వ్యక్తం చేశారు. 

బొగ్గు గనుల వేలానికి బీఆర్‌ఎస్ మోకాలడ్డు 

సింగరేణి కార్మికులను బీఆర్‌ఎస్ తమ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నదని మంత్రి మండిపడ్డారు. బొగ్గు గనుల వేలం సింగరేణి పాల్గొనకుండా అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ మిత్రులు ప్రైవేట్ సంస్థలకు వేలాన్ని అప్పగించారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగానే కోయగూడెం బ్లాక్  సత్తుపల్లి బ్లాక్ బొగ్గు గనులు సింగరేణికి దక్కకుండా పోయాయని, దీంతో రూ.2 వేల కోట్ల ఆదాయం నిలిచిపోయిందని వివరించారు.

బీఆర్‌ఎస్ హయాంలోనే రూ. 40 వేల కోట్ల బొగ్గు, విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని, 10 వేల మంది కార్మికులు క్వార్టర్లు కట్టిస్తామన్న హామీని, డెఫెండెంట్ ఉద్యోగాల పరిధి 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతామని, కొత్త గనులు ప్రారంభిస్తామన్న హామీలను అమలు చేయలేదని గుర్తుచేశారు. 

బీఆర్‌ఎస్ హయాంలో ఉన్న కాంట్రాక్టర్లే ఇప్పుడు కూడా సింగరేణిలో ఉన్నారని, కేసీఆర్ బంధు మిత్రులు, బీఆర్‌ఎస్‌కు సంబంధించిన వారే ఎక్కువ మంది ఉన్నారని వివరించారు. మెడికల్ బోర్డుపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష చేశారని, న్యాయపరంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

సింగరేణికి వచ్చిన లాభాల్లో ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి కూడా రూ.5,500 బోనస్ ఇచ్చామని, రూ.40 లక్షల ప్రమాద బీమా, సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో సుపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి సైతం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. నైని బొగ్గు గనులపై సింగరేణి పాదర్శకంగా ముందుకు వెళుతుందని వెల్లడించారు.