27 July, 2026 | 11:45 AM

మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు

27-07-2026 11:22 AM
  1. విద్యార్థులపై కేసులు ఉండవన్న మోదీ హామీ ఏమైంది?
  2. కేసులు ఎత్తివేయకుండా.. ఇంకా అణచివేతకు గురిచేస్తారా?
  3. ఢిల్లీలో పెల్లెట్ తుపాకులు..బిహార్ లో ఏకే 47
  4. NDA ప్రభుత్వానికి కుట్రలే తెలుసు.. మంచి తెలియదు
  5. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలి

న్యూఢిల్లీ: విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదంటూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎక్స్ లో పోస్టు చేశారు. బీహార్ లో ఆందోళన(Bihar Protests) చేసిన విద్యార్థులపై కాల్పులు జరిపారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాల్పులు జరపడమే కాకుండా తిరిగి విద్యార్థులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు ఉండవన్న ప్రధాని హామీ ఏమయింది?, కేసులు ఎత్తివేయకుండా.. ఇంకా అణచివేతకు గురిచేస్తారా? అని ప్రశ్నించారు.

'ఢిల్లీలో పెల్లెట్ గన్‌లు, బీహార్‌లో ఏకే-47లు'

ఢిల్లీలో పెల్లెట్ తుపాకులు వాడితే.. బీహార్ లో ఏకే 47 వాడారని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి కుట్రలే తప్ప.. మంచి చేయడం తెలియదని విమర్శించారు. దేశంలోని విద్యార్థులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. నీట్ యూజీ పేపర్ లీక్(NEET UG paper leak) పై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేసిన ఆందోళన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సుఖాంతం అయింది.