26 July, 2026 | 3:34 AM

జిట్స్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ

26-07-2026 12:38 AM

కరీంనగర్, జూలై 25 (విజయక్రాంతి): జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు రూ.18వేలు స్కాలర్‌షిప్ హామీని సంస్థ యాజమాన్యం అమలు చేసింది. ఈ సందర్భంగా కట్ట హరీశ్వర్, అబ్దుల్ రెహన్, అదీ బా మహీన్, జి. భువనశ్రీ, యూ. అక్షిత, బి.  లక్ష్మీ ప్రసన్న, కొప్పుల ప్రశాంత్ కుమార్, మొహమ్మద్ తాలిబొద్దీన్, గుండవేన అశ్విత్ సాయి, బునద్రి అజయ్ తేజ, వీరబత్తిని శ్రీమని, పెద్ది అవినాష్, గంగాధర ఉదయ్, కోట అఖిల్, గుండేటి  రిక్షిత్ చంద్రన్ , గాదె హన్సిక , వెలగందుల శ్రీనిధిలకు ఒక్కొక్కరు 18 వేల రూ పాయల విలువైన స్కాలర్షిప్ చెక్కులను జ్యో తిష్మతి విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు షాలిని అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.