2 June, 2026 | 4:34 AM

వారికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలి

02-06-2026 01:11 AM
  1. మోడల్, కేజీబీవీ టీచర్లకు ఇవ్వకుండానే జీతాల్లో కోతలా?
  2. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక డి మాండ్ అయిన ఈహెచ్‌ఎస్ లబ్ధి ని కేవలం కొంతమందికే పరిమి తం చేయడం సమంజసం కాదని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా సొసైటీల పరిధిలో నడిచే పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఈ హెల్త్ కార్డ్ సౌకర్యాన్ని వర్తింపజే యాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అసలు హెల్త్ కార్డులు చేతికి ఇవ్వకుండా, దానికి సంబంధించిన నిబంధనలు స్పష్టంగా ప్రకటించకుండానే ఉపాధ్యాయుల జీతాల నుంచి ముందే ప్రీమియం మొత్తాన్ని కట్ చేయడం సరైంది కాదన్నారు.