14 July, 2026 | 4:21 PM

Breaking News

వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •   బస్సులో టెన్త్ మెమో పోగొట్టుకున్న విద్యార్థి   •   ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి   •   సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •   తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •  

అర్హులైన ఓటర్లను నమోదు చేయించాలి: ఎమ్మెల్యే గడ్డం వినోద్

14-07-2026 03:34 PM

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): అర్హులైన ఓటర్ల పేర్లను నమోదు చేపించాలని SIRపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్  నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తాండూర్ మండల కేంద్రంలోని తాండూర్ గ్రామపంచాయతీ బీసీ కమిటీ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR–2026) అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మండల బీఎల్‌ఏలు (BLAలు), సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు SIR ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించారు.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాల్లో బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో విలువైనదని, ప్రజల ఓటు హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. SIR ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్లకు అవసరమైన సూచనలు అందించాలని బీఎల్‌ఏలకు సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.