3 April, 2026 | 3:40 AM

కూలి పనుల్లో ప్రధానోపాధ్యాయుడు

03-04-2026 12:00 AM

కొల్చారం, ఏప్రిల్ 2: ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ప్రధానోపాధ్యాయుడు మండల వనరుల కేంద్రంలో కూలి పనులు చేస్తుండడం గురువారం కొల్చారం మండల కేం ద్రంలో చర్చనీయాంశమైంది. రంగంపేట ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశం గత కొన్ని రోజులుగా మండల వనరుల కేంద్రంలో జరు గుతున్న సివిల్ పనుల్లో పాల్గొంటున్నట్లు తెలిసింది.

కాలువలు తవ్వడం, సిమెంట్ కలపడం, పనులను పర్యవేక్షించడం వంటి పనులు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పాఠశాలకు వెళ్లి వి ద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయుడు ఇలా కూలి పనుల్లో కనిపించడంతో ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల విధులను పక్కనపెట్టి సివిల్ పనులు చేయిస్తున్న వారిపై, అలాగే సంబంధిత ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఈ విషయంపై జిల్లా విద్యాధికారి విజయను వివరణ కోరగా, పూర్తి వివరాలు తెలుసుకుని సంబంధిత ఉపాధ్యాయుడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.