30 August, 2026 | 11:14 AM

Breaking News

కడియాల కుంట సర్పంచ్ పై ఆశ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫిర్యాదు   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   NEET PG 2026: దేశవ్యాప్తంగా నీట్ పీజీ 2026 పరీక్ష   •   10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •   నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి   •  

కాటారం సభకు అన్నీతానే!

21-04-2026 01:39 AM

జన సమీకరణతోపాటు సభ సక్సెస్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుదే ముఖ్యపాత్ర

మంథని ఏప్రిల్ 20 (విజయ క్రాంతి) : మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరి పల్లిలో రెండో విడత రైతుభరోసా సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్న సభకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోదరుడు టీపీసీసీ ప్రధానకార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్ని తానై వ్యవహరించారు.

సభను సక్సెస్ చేసేందుకు కీలకపాత్ర పోషించారు. మంథని నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుంచి జన సమీకరణతో పాటు సభ సక్సెస్‌లో శ్రీనుబాబుదే ముఖ్యపాత్ర. అన్నకు తగ్గ తమ్ముడిగా హంగూఆర్భాటాలు లేకుండా ఒక సామాన్య కార్యకర్తలా సభ వద్ద ఉండి సభకు వచ్చిన మహిళలను రైతులను ప్రజలను దగ్గరుండి స్వాగతం పలికారు.

మంత్రి శ్రీధర్‌బాబు సీఎంతో పాటు బిజీగా ఉండడంతో జన సమీకరణలో వాహనాల ఏర్పాట్లు, సభ వద్ద తాగునీటి ఏర్పాట్లలో శ్రీనుబాబు పాత్ర మరువలేనిది. రైతు భరోసా సభ అనుకున్న దానికంటే ఎక్కువ మంది హాజరై ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు శ్రీనుబాబు కృషి చేశారు. సభకు హాజరైన ప్రజలకు రైతులకు సభ సక్సెస్‌లో పాల్గొన్న అన్ని శాఖల అధికారులకు శ్రీనుబాబు కృతజ్ఞతలు తెలిపారు.