21 April, 2026 | 3:15 AM

మున్సిపల్‌లో పైసల పంచాయితీ

21-04-2026 01:43 AM

పాత టెండర్లు రద్దు.. కొత్త టెండర్లపై వివాదం.. 

రూ.15 కోట్ల నిధుల కేటాయింపులపై పార్టీల రగడ 

వార్డులకు నిధులు కేటాయింపులో వివక్షత  వద్దు: బీజేపీ కౌన్సిలర్లు

అభివృద్ధిపై మత విద్వేషాలు వద్దు: కాంగ్రెస్ కౌన్సిలర్లు 

నిర్మల్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు ముగిసి నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే నిర్మల్ మున్సిపాలిటీలో పైసల పంచాయితీ మొదలైంది. మున్సి పాలిటీలోని ఆయా వార్డుల అభివృద్ధికి ప్రభు త్వం రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయగా చేపట్టే పనులపై కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంటుంది.

మున్సిపాలిటీకి ప్రత్యేక పాలనలో తమ ముఖ్యమంత్రి రూ.15 కోట్లు నిధులు మంజూరు చేశారని కాంగ్రెస్ నాయకులు ప్రకటించుకున్నారు.. కాదు, ఎమ్మెల్యే సహకారంతోని రూ.15 కోట్లు మంజూరయ్యాయని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులు ఉండగా ఆ వార్డుల్లో ప్రజల అవసరాలను గుర్తించి ఆయా వార్డులు మంజూరైన ప్రభుత్వ నిధులను కేటాయింపులు చేపట్టవలసి ఉంటుంది.

మున్సిపల్ పాలకవర్గం ఏర్పడక ముందు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సహకారంతో అప్పటి మున్సిపల్ అధికారులు పట్టణంలోని 42 వార్డులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వార్డుల వారీగా రూ.15 కోట్ల బడ్జెట్‌ను సర్దుబాటు చేశారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభంలోని మున్సిపల్ ఎన్నికలు వచ్చా యి. ఆ ఎన్నికల్లో మున్సిపాలిటీలో మొత్తం 42 వార్డులకుగాను 24 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ వైస్ చైర్ పర్సన్‌తో పాటు అధికారం చేపట్టారు. బీజేపీకి 13 కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌కు ౨ కౌన్సిల్ స్థానాలు వచ్చాయి. అయితే గతంలో రూ.15 కోట్లతో చేపట్టి టెండర్లను కొత్త టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. 

నిధుల కేటాయింపుల్లో లొల్లి..

కొత్తగా ఏర్పాటైన నిర్మల్ మున్సిపల్ పాలకవర్గం పాత టెండర్లను రద్దుచేసి, కొత్త టెండర్ల ద్వారా పనులు చేపట్టేందుకు తీర్మానం చేశారు. దీనిపై బీజేపీ కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. పాత పద్ధతి ప్రకారమే టెండర్లు చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు.

అయితే నిర్మల్ మున్సిపల్‌లోని 42 వార్డులో అప్పట్లో కేటాయించిన నిధులు, పనులు కొన్ని మార్పులు చేర్పులు చేసి అన్ని వార్డుల్లో కొత్త మున్సిపల్ పాలకవర్గం సర్దుబాటుతో నిధుల కేటాయిం పు హెచ్చుతగ్గులు చేసింది. అయితే గతంలో బీజేపీ కౌన్సిలర్ ప్రాతినిథ్యం వహించి వార్డు ల్లో గతంలో కేటాయింపులను తగ్గించి, వారికి అనుకూలమైన కాంగ్రెస్, మైనార్టీ వార్డులో నిధులు ఎక్కువగా మళ్లీంచారని, హిందూ వార్డులో తక్కువ నిధులు కేటాయిస్తున్నారని  ఇది అన్యాయమని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తూ కలెక్టర్, మున్సిపల్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కావడం, ఎమ్మెల్యే కృషితో నిధులు మంజూరైనందున అన్ని వార్డులు నిధులు కేటాయింపు విషయంలో వివక్షత లేకుండా ఎక్కడ ఏ వార్డులు ఏం అవసరంలో గుర్తించి బీజేపీ కౌన్సిలర్ల అభిప్రా యం మేరకు కొత్త టెండర్లు పనులు పైసలు కేటాయింపు చేపట్టాలని బిజెపి కౌన్సిలర్ గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మున్సిపల్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత గురువారం మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించి రూ.15 కోట్లతో మంజూరయ్యే పనుల టెండర్ల ప్రక్రియపై మున్సిపల్‌లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి హాజరై పాత టెండర్లు రద్దు చేసి, కొత్త టెండర్ల పనులకే తీర్మానం చేసి  సమావేశం 10 నిమిషాల్లో ముగించారని బీజేపీ నేతలు ఆరోపిస్తు న్నారు. తాము ప్రాతినిథ్యం వహించే వార్డుల్లో తమ ప్రమేయం లేకుండా పాలక పక్షం ఏకపక్షంగా తమకు నిధులు తక్కువ కేటాయించింద ని ఈ విషయమై చర్చించాలని బిజెపి నేతలు పట్టుబడుతున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ ముఖ్యమైన అధికారులు లేకుండానే తీర్మానం చేయడంపై బీజేపీ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. 

పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ..

రూ.15 కోట్ల నిధుల టెండర్ల ప్రక్రియలో పూర్తిగా పారదర్శకంగా వివరిస్తున్నామని, అయినప్పటికీ బీజేపీ కౌన్సిలర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్  పార్టీ, చైర్‌పర్స న్ మండిపడుతున్నారు. పట్టణంలోని 42 వార్డులో సుమారు 18 వార్డులు శివారు కాల నీ కావడంతో అక్కడ ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఉన్న ప్రజల మౌలిక అవసరాలను గుర్తిం చి ఆ వార్డుల్లో ఎక్కువ నిధులను సర్దుబాటు చేశామని దీన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.

అభివృద్ధి పనుల విషయంలో మత విద్వేషాల ను రెచ్చగొట్టే విధంగా బిజెపి నేతలు అభివృద్ధిని అడ్డుకున్నందుకు ప్రయత్నిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో బిజెపి, బీఆర్‌ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్ల సమక్షంలోని మున్సిపల్ సమావేశం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అప్పుడు అభ్యంతరం తెలుపని బిజెపి కౌన్సిలర్లు ఇప్పుడు అభ్యంతరం తెలుపుతూ రాజకీయాన్ని చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు వారిపై మండిపడుతున్నారు.

తమకు నిధుల కేటాయింపుల్లో ఎలాంటి వివక్ష లేదని పట్టణం లోని 42 వార్డుల కౌన్సిలర్లు ప్రజల మౌలిక సదుపాయాలు కల్పన బాధ్యత మున్సిపల్ పాలకవర్గంపై ఉందని వారు కౌంటర్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా నిర్మల్ మున్సి పాలిటీలో అటు బిజెపి ఇటు కాంగ్రెస్ రూ.15 కోట్ల నిధుల విషయంలో ఎవరికి వారే ఆందోళన చేయడంతో నిర్మల్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య వివాదం రోజురోజుకూ పెరగడంపై పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

బీజేపీ కౌన్సిలర్ల వార్డుల్లో వివక్ష

పట్టణంలో 42 వార్డుల్లో రూ.15 కోట్లతో చేపట్టే పనుల విషయంలో బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్న వార్డుల్లో వివక్ష చూపుతున్నారు. గతంలో కేటాయించిన బడ్జెట్‌కు కోతలు విధించి వేరే వార్డులకు నిధులను మళ్లించారు. నిధుల కేటాయిం పు టెండర్ల ఎజెండాపై మున్సిపల్ సమావేశంలో తమ డిమాండ్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండానే మున్సిపల్ పాలకవర్గం ఏకపక్షంగా తీర్మానం చేయడం చాలా బాధాకరం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.

సాదం సప్న, బీజేపీ కౌన్సిలర్ 

ఎన్నికల అప్పుడే పార్టీలు..

నిర్మల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత పాలకవర్గంపై ఉంది. ఎన్నికల అప్పుడే పార్టీ లు. ఇప్పుడు ప్రజలందరికీ సమిష్టిగా అభివృద్ధి చేయవలసిన బాధ్యతను గుర్తించే పాత టెండర్లు రద్దుచేసి కొత్త టెండర్ల ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చేస్తున్నాం. రూ.15 కోట్ల పనుల విషయంలో శివారు కాలనీలు సమస్యలు ఎక్కువగా ఉన్న కాలనీ లో నిధులను ఎక్కువగా మంజూరు చేసాం. దీన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధి విష యంలో రాజకీయాలు వద్దు. 

 అప్పల కావ్య, మున్సిపల్ చైర్‌పర్సన్