నక్షత్రోవను సర్వే చేయించండి
05-07-2026 01:06 AM
పట్టభూమి అక్రమణపై ఆర్డీఓ సీరియస్
కోహెడ, జూలై 4(విజయక్రాంతి): పట్టాభూమి ఆక్రమించి.. దౌర్జన్యం! ప్రభుత్వ నక్షత్రోవ సైతం కబ్జా అనే శీర్షిక విజయక్రాంతి దినపత్రికలో శనివారం ప్రచురితమైన కథనానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి స్పందించారు. ఆక్రమణకు గురైన నక్షత్రోవను సర్వే చేయించి పునఃరుద్దరించాలని కోహెడ తహసీల్దార్ నవీన్ కుమార్‌ను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు.






