16 April, 2026 | 4:01 AM

సీబీఎస్‌ఈ పదవ తరగతి ఫలితాల్లో హార్వెస్ట్ హవా

16-04-2026 02:22 AM

ఖమ్మం, ఏప్రిల్ 15(విజయక్రాంతి): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ బోర్డు) దేశవ్యాప్తంగా నిర్వహించిన పదవ తరగతి పరీక్షా ఫలితా లలో తమ విద్యార్థినీ విద్యార్థులు తిరుగులేని విజయాలు సాధించి అగ్రశ్రేణిలో నిలిచారని హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల యాజమాన్యం తెలియజేశారు. 

తమ పాఠశాల నుంచి 261 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షకు హాజరవగా మొదటి విడత ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించడం అభినం దనీయమన్నారు. తమ విద్యార్థి పప్పుల జెదిత్య జోష్ సార్థక్ 490/500 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారన్నారు. రుద్రభట్ల లక్ష్మి శార్వాణి 488/500, వంగల కేతన్ 487/500, గుండమల్ల శ్రీవసిష్ట్ 487/500, నర్ర మోక్షశ్రీ 485/500, పాకనాటి కృష్ణమనోహర్ 484/500, పిన్ని తపస్వి 483/500, అవారి విశ్వతేజ్ 483/500, మట్టపర్తి అమిత కృష 481/500, దోరడ్ల కళ్యాణి 480, కంబంపాటి దీత్య 480/500 సాధించడం హర్షనీయమన్నారు.

తమ విద్యార్థినీ విద్యార్థులు తెలుగులో 11 మంది 100/౧00,129 మందికి 90% మార్కు లు, ఇంగ్లీషులో 5గురు 100/౧00,166 మందికి 90% మార్కులు, గణితంలో ఇద్దరికి 100/౧00,56 మందికి 90% మార్కులు, సైన్స్‌లో ఇద్దరికి 98/ 100, 60 మందికి 90% మార్కులు, సోషల్‌లో 4గురికి ౯8/౧00, 76 మందికి 90%మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. తమ విద్యార్థులు 470 మార్కులకు పైగా 34 మంది, 450 మార్కులకు పైగా 74 మంది సాధించారన్నారు. ‘హార్వెస్ట్’ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల కరస్పాండెంట్  పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్. పార్వతీరెడ్డి విద్యార్థినీ విద్యార్ధులను అభినందించారు. విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయినీ, ఉపా ధ్యాయులను యాజమాన్యం అభినందించారు.