రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
25-03-2026 03:48 PM
- సిద్దిపేటలో రేవంత్ రెడ్డి పోటీ చేయాలి
- ఎప్పుడు గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు
- రేవంత్ మళ్లీ సీఎం కాలేరు
- పునర్విభజనతో బీఆర్ఎస్ కు మేలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు. తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సిద్ధిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్ రెడ్డి పోటీ చేయాలని, అందుకు తానే స్వయంగా ఆహ్వానిస్తున్నాని హరీశ్ రావు(Harish Rao Challenge) పేర్కొన్నారు. ఎప్పుడు గోల్ కొట్టాలో తమకు బాగా తెలుసని ఆయన వెల్లడించారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తారో లేదో చెప్పడం కంటే చూస్తేనే బాగుంటుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో బీఆర్ఎస్ కు మేలు జరుగుతుందని సూచించారు.




