హ్యాపీ రాజ్ భావోద్వేగాల ప్రయాణం
సంగీత దర్శకుడిగా అలరిస్తూనే హీరోగానూ మెప్పిస్తున్నారు జీవీ ప్రకాశ్ కుమార్. ఆయన నుంచి వస్తున్న తాజాచిత్రం ‘హ్యాపీ రాజ్’. హీరో-, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ధ నిర్మించిన ఈ సినిమాలో ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీగౌరీప్రియ కథానాయికగా నటిచింది. మార్చి 27న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టాలీవుడ్ డైరెక్టర్లు శివ నిర్వాణ, వెంకీ అట్లూరి అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు జీవీ ప్రకాశ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఫన్ కమర్షియల్‌మెంట్స్ అన్నీ ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఫాదర్‌ని సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుంది” అన్నారు.
హీరోయిన్ శ్రీగౌరీప్రియ మాట్లాడుతూ.. “నేను నటించిన తమిళ్ సినిమా నా మాతృభాష తెలుగులో ఒకేరోజు రావడం చాలా ప్రత్యేకం. నా కెరీర్‌లో ఇలా ఫస్ట్ టైమ్ జరుగుతుంది. టైటిల్‌లో ఉన్నట్లే ఈ సినిమా చాలా హ్యాపీ ఫిలిం” అని తెలిపింది. ‘ఈ సినిమా నవ్వించడమే కాదు.. చాలా ఎమోషన్స్‌ను టచ్ చేస్తుంద’ని చిత్ర దర్శకుడు మరియా రాజా చెప్పారు. ‘హై ఎమోషన్స్, మంచి ఫ్యామిలీ డ్రామా ఉన్న సినిమా ఇద’ని నిర్మాత జైవర్ధ తెలిపారు. మైత్రి మూవీ మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, అతిథులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.




