27 July, 2026 | 2:24 AM

హ్యాపీ బర్త్ డే డైలాగ్ కింగ్

27-07-2026 12:00 AM

తెలుగు ప్రేక్షకులకు సాయికుమార్ అనే పేరు పరిచయం అవసరం లేదు. ఆయన పే రు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గంభీరమైన గాత్రం, స్పష్టమైన ఉచ్చారణ, శక్తివంతమైన డైలాగ్ డెలివరీ. ఎంతో మంది హీరోలకు తన స్వరంతో ప్రాణం పోసిన ఆయన, అదే గళంతో నటుడిగానూ తిరుగులేని గుర్తింపు సంపాదించారు.

అందుకే తెలు గు చిత్రసీమ ఆయనను ప్రేమగా ’డైలాగ్ కింగ్’ అని పిలుస్తుంది. 1961 జూలై 27న జ న్మించిన సాయికుమార్.. ప్రముఖ నటుడు పి.జె. శర్మ కుమారుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన ప్రతిభతోనే ప్రత్యే క స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవలే సినీ పరిశ్రమలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసి అరుదైన మైలురాయిని అందుకున్నా రు. కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో హీరోలు, ముఖ్య పాత్రలకు తన గళాన్ని అందించారు. ఆయన డబ్బింగ్ చెప్పిన తొలి చిత్రం సంసారం.

అనంతరం బాలనటుడిగా దేవుడు చేసిన పెళ్లి చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా మా త్రం కన్నడలో వచ్చిన పోలీస్ స్టోరీతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో సాయికుమార్‌కు అపారమైన క్రేజ్ వచ్చింది. తర్వాత తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్ర లు పోషి స్తూ తన నటనా ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించారు.

శక్తివంతమై న పోలీస్ పాత్రలైనా, భావోద్వేగభరితమైన తండ్రి పా త్రలైనా, ప్రతినాయకుడి పాత్రలై నా ఆయన నటనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్ర స్తుతం సాయికుమార్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నారు. రవితేజ ఇరుముడి, ధర్మస్థల నియోజకవర్గం, సంబరాల ఏటిగట్టు, నాగార్జున 100వ చిత్రం, ఎస్వీ కృష్ణారెడ్డి వేదవ్యాస్, కిరణ్ అబ్బవరం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం, రోషన్ మేక ఏమో ఏమో ఇది, విశ్వక్ సేన్ చిత్రం, సిద్ధు జొన్నలగడ్డ లుంగీ మ్యాన్, నితిన్-నాని ప్రాజెక్ట్, సత్యదేవ్ ’ఫుల్ బాటిల్’, వరుణ్ తేజ్ ’బరి’, వరలక్ష్మీ శరత్‌కుమార్ కూర్మావతారం’, సాయి ప్రకాష్ తెర కెక్కిస్తున్న ’సాయి బాబా’ వంటి చిత్రా ల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే అశ్విన్ బాబు ’వచ్చినవాడు గౌతమ్’ చిత్రం లో స్పె షల్ అప్పియరెన్స్, ఆది సాయికుమార్ ’ఎస్‌ఐ యుగంధర్’లో కామియో రో ల్లో కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్ ప్ర ధాన పాత్రలో రూపొందుతున్న మూడు లాంత ర్లు, కన్యాశుల్కం వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నారు. కన్నడలో శివరాజ్‌కుమార్ బైల్, నిరూప్ బండారి ’సత్య: సన్ ఆఫ్ హరిశ్చం ద్ర’, కిచ్చా సుదీప్ ’బిల్లా రంగా భాషా’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేస్తున్నారు. భవిష్యత్తు లోనూ ఇలాంటి మరెన్నో అద్భుతమైన పా త్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, నిండు నూరే ళ్లు ఆ యురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ డైలాగ్ కింగ్ సాయికుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు!