త్వరలో తలైవా ఆత్మకథ, బయోపిక్?
తన జీవిత ప్రయాణాన్ని ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోవాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ భావిస్తున్నారు. ఆ త్మకథపై పుస్తకం, బయోపిక్ తీసుకురావాల ని పలువురు సన్నిహితులతో ఇప్పటికే చర్చ లు జరిపారని పలు వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అధికా రిక ప్రకటన ఏదీ సూపర్‌స్టార్ వైపు నుంచి వెలువడనప్పటికీ ఆయన అభిమానులు మాత్రం త్వరలో ఆత్మకథ పుస్తకం, బయోపిక్ రావాలని ఎదురుచూస్తున్నారు.
వీటిలో తన వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, అపజయాలు, అగ్రస్థానా నికి చేరుకునేందుకు ఎదుర్కొన్న సవాళ్లు తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కు మార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సిని మా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14 న విడుదల కానుంది. ‘ధర్మన్’ అనే చిత్రం షూటింగ్ లో కూడా ఆయన పాల్గొంటున్నారు.






