ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో?
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచా రంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల లక్ష్యంగా మేకర్స్ చిత్రీకరణ పనులను ఇప్పటివరకు శరవేగంగా సాగించారు.
ఇటీవల కాకినాడ పోర్టులో జరుగుతున్న షూటింగ్‌లో బాలకృష్ణ కాలు జారి కిందపడిపోవడం.. ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స జరిగిపోయాయి. దీంతో అనూహ్యంగా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా వుంటే, బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న 112వ సినిమా గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త వినవస్తోంది. దర్శకుడు కొరటాల శివ తన మార్కు సామాజిక సందేశా నికి బాలకృష్ణ మాస్ ఇమేజ్‌ను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అమరావతిలో ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యు వసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత. సుమారు రూ.200 కోట్ల భారీ వ్యయంతో పాన్-ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక శక్తివంతమైన ఫ్లాషబ్యాక్ ఎపిసోడ్‌లో ఆమె కనిపిస్తారని టాక్. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా ఇందు లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, 2027 వేసవి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ ప్రాజెక్టు గురించి తాజాగా అం దుతున్న సమాచారం ప్రకారం.. ఇందులో ఓ లేడీ విలన్ పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఐశ్వర్య రాజేశ్ ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా కాకుండా ప్రతినాయికగా కనిపించనుందనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఐశ్వర్య రాజేశ్ ఇందులో మెయిన్ విలన్ కాదని.. ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించనుందని టాక్. మరి ఐశ్వ ర్య రాజేశ్ ఇందులో స్టైలిష్ లేడీ విలన్‌గా కనిపిస్తుందా? లేక మాస్ విలన్‌గా అలరించ నుందా? అనేది ఆసక్తికరమైన సందేహమే!






