నేడు హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు
23-03-2026 12:00 AM
ఎల్బీనగర్, మార్చి 22 : కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో సోమవారం హుండీల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ఉదయం 9.30 గంటల నుంచి దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి పర్యవేక్షణలో హుండీల్లో భక్తులు వేసిన కానుకల ను లెక్కించనున్నారు. కార్యనిర్వహణాధికారి, ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఆలయ అర్చక, సిబ్బంది, భక్తుల సమక్షంలో కానుకలను లెక్కించనున్నట్లు ఈవో లావణ్య తెలిపారు.




