3 April, 2026 | 3:15 AM

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

03-04-2026 01:17 AM

నిర్మల్/లక్ష్మణ్ చందా/కుబీర్/ఖానాపూర్/బైంసా, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో హనుమాన్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జంగల్ హనుమాన్ దక్షిణముఖ హనుమాన్ ఆలయాల్లో నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పారావు కావ్య గణిత ప్రవర్తి టిఆర్‌ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ పూజలు చేశారు. బైంసాలు ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు.

లక్ష్మణ చందా మండలంలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములు హనుమాన్ నామస్మరణ చేస్తూ గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. కుబీర్ మం డలంలోని ఆయా గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో కాషాయ జెండాలు పట్టు కుని ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేపట్టారు. కడెం ఖానా పూర్ మండలాల్లో కూడా హనుమాన్ జ యంతి వేడుకలు ఘనంగా జరిగాయి హనుమాన్ మాల ధర్నా స్వీకరించిన భక్తులు కొండగట్టుకు పాదయాత్రగా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు.