12 May, 2026 | 8:22 PM

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

12-05-2026 07:04 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): హనుమాన్ జయంతి ని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హనుమంతుడికి పూజలు నిర్వహించారు. మంగళవారం అమీర్ పేటలోని కుమ్మరి బస్తీలో గల హనుమాన్ దేవాలయం లో పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.