15 August, 2026 | 12:55 AM

బీజేపీ నేతల ఆలోచనా విధానం దిగజారిందా..?

15-08-2026 12:05 AM

డాక్టర్ కోట నీలిమ

సికింద్రాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో కాంగ్రె స్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన రామ్లీలా మైదాన్ను శుద్ధీకరణ పేరుతో బీజేపీ నేతలు హోమం నిర్వ హించి శుద్ధి చేయడాన్ని పీసీసీ వైస్ ప్రెసిడెం ట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తీవ్రంగా ఖండించారు.

ఒక దళిత నాయకుడు ప్రజా సమస్యలపై సభ నిర్వహించిన ప్రదేశాన్ని అపవిత్రంగా భావించి శుద్ధి చేయడం అత్యంత అ వమానకరమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చట్టపరంగా సమగ్ర వి చారణ జరిపి, అంటరానితనం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో బన్సీలాల్పేట్ జబ్బార్ కాంప్లెక్స్ వద్ద మల్లికార్జున ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష కార్య క్రమంలో డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కోట నీలిమ మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

హల్ద్వానీలోని రామ్లీలా మైదాన్లో మల్లికార్జున ఖర్గే ప్రజా సమస్యలపై మాత్ర మే మాట్లాడారని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక సమస్యలు, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారని, ఎక్కడా ఏ మతాన్ని కించపరిచేలా కానీ, ఏ వర్గాన్ని అవమానించేలా కా నీ మాట్లాడలేదని పేర్కొన్నారు. దళిత నాయకుడు సభ నిర్వహించిన ప్రదేశం అపవిత్రమ వుతుందని భావించే స్థాయికి బీజేపీ నేతల ఆలోచనా విధానం దిగజారిందా? అని ప్ర శ్నించారు. సామాజిక న్యాయం కోసం చివరి వరకు పోరాడుతుందని డాక్టర్ కోట నీలిమ స్పష్టం చేశారు.