14-02-2026 12:00:00 AM
30 ప్లస్ బీజేపీకి దక్కితే ఎక్స్ అఫిషియో ఓట్లతో మేయర్ స్థానం బిజెపికే
నిజామాబాదు కార్పొరేషన్‌లో ఖాతా తెరవని బిఆర్ఎస్
నిజామాబాద్ ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ నగర మేయర్ స్థానానికై హోరాహోరి పోరు జరుగుతోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలోనే పాగ వేసిన భారతీయ జనతా పార్టీ ఆ తరువాత ఎమ్మెల్యే స్థానాలు చైర్మన్ స్థానాలు దక్కించుకుంది గతంలో నిజామాబాద్ జిల్లాలో 60 స్థానాలకు గాను 28 స్థానాలు నిలదొక్కుకున్న బిజెపి తిరిగి ఇప్పుడు కూడా బిజెపి శ్రేణులు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు పట్టు వదలకుండా ప్రయత్నించడంతో పాటు ప్రజల్లో బిజెపి పై ఉన్న అభిప్రాయం మేరకు ఈసారి ఎన్నికల్లో 25 నుంచి 30కి పైగా సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది ఈ ఫలితాలు ప్రకటించే సమయానికి. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ఆర్మూర్ భీమ్గల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.
బోధన్ బల్దియాలో మొత్తం 38 వార్డులు ఉండగా అందులో కాంగ్రెస్ 17 సీట్లు గెలుపు పొంది దక్కించుకోగా ఎంఐఎం పార్టీకి 12 వార్డులు దక్కాయి అలాగే బోధనలో కొద్దిగ గొప్ప సత్తా చాటిన బిఆర్‌ఎస్ కు ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీకి మూడు సీట్లు దక్కాయి స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఒక సీటు దక్కించుకొని గెలుపులో ఉన్నారు మొత్తానికి బోధనలో హంగు ఏర్పడింది. ఇక ఆర్మూర్ బల్దియా పరిధిలో మొత్తం 36 వార్డులు ఉండగా 19 వార్డులను కాంగ్రెస్ గెలుపు గెలుచుకుంది. బిజెపి 8 వార్డులను గెలుపొందింది బి ఆర్ ఎస్ 5 సీట్లు గెలుపు పొందగా ఎంఐఎం కు ఒక సీటు దక్కింది. ఆర్మూర్ బల్దియా పై కాంగ్రెస్ తన జెండాను ఎగురవేసింది.
భీంగళ్ బల్దియాలో మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8 వార్డులలో గెలుపొందింది టిఆర్‌ఎస్ నాలుగు వార్డుల్లో గెలిచింది. భీమ్గల్ బల్దియాలో కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. ఇదిలా ఉండగా నిజామాబాద్ లో హోరాహోరీగా బిజెపి కాంగ్రెస్ మధ్య పోరు సాగుతుండగా ఎంఐఎం కూడా సత్తా చాటింది 20 నుండి 21 వార్డుల వరకు ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉంది బిజెపి కాంగ్రెస్ హోరాహోరి పోటీ కొనసాగుతోంది.
భారతీయ జనతా పార్టీకి 30 కంటే అధిక స్థానాలు చేకూరితే మేయర్ దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా టిఆర్‌ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా వెనుకబడిపోయి ఉంది ఇప్పటివరకు ఒక్క వార్డులో కూడా తన ఖాతా తెరవలేదు. ఒక్క డివిజన్ కూడా టిఆర్‌ఎస్ కు దక్కలేదు. బిజెపి కాంగ్రెస్ పోటీలో హోరాహోరీ పోరులో హంగు ఏర్పడితే 30 ప్లస్ గా బిజెపికి సీట్లు గనక దక్కితే ఎక్స్ అఫీషియో ఓట్లు ఎంపీ ఎమ్మెల్యేతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ కనుక ఓటు ఇక్కడే నిర్ణయించుకునీ మద్దతు ఇస్తే బిజెపికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే సమయం వర్గాలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి.