calender_icon.png 14 February, 2026 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో నలుగురికి జైలు

14-02-2026 12:00:00 AM

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 13 : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11 మందిని శుక్రవారం కోర్టులో హాజరు పరిచినట్టు ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో తనిఖీ చేయగా వారు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు.

న్యాయమూర్తి కాంతారావు విచారణ జరిపి 9 మందికి కలిపి రూ.92 వేలు జరిమానా విధించారని తెలిపారు. ఇద్దరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని ముగ్గురికి రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పేర్కొన్నారు.

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో..

సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తాబాద్, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తాల వద్ద తనిఖీ చేయగా, 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నామని ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా, విచారణ జరిపి ఒకరికి రెండు రోజులు, మరొకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారని చెప్పారు. మిగతా 9 మందికి కలిపి రూ.12 వేల జరిమానా విధించారని తెలిపారు.