ఏసీబీ వలలో పెద్దపల్లి మున్సిపల్ అధికారి
రూ.2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సతీష్
పెద్దపల్లి,జూలై 14(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. పెద్దపల్లి మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారి సతీష్(Municipal Officer Satish) రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేసేందుకు బత్తుల శ్రీను వద్ద నుంచి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలో సతీష్‌ను పట్టుకున్నారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పెద్దపల్లి జిల్లాలో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై చర్చ మొదలైంది. లంచం ఆశించే అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.






