29 July, 2026 | 8:51 PM

కేరళ గ్లోబల్ హైస్కూల్లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

29-07-2026 07:37 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కేరళ గ్లోబల్ హైస్కూల్లో గురుపూజోత్స కార్యక్రమం విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయుల పాదాలకు విద్యార్థులు అభిషేకం చేసి శాలువలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు,ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లతిక మాట్లాడుతూ,గురువులను,ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారని అన్నారు.

హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారని  గురుపూజోత్సవం సందర్భంగా గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి శిష్యులు ఆశీర్వాదములు తీసుకుంటారని అన్నారు.తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి,ముక్తి వైపు నిడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారని విద్యార్థులకు  అవగాహన కలిపించారు.గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా ఉండాలని వ్యాసమహాముని పుట్టిన రోజు సందర్భంగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.