టీజీ సెట్ ఫలితాల్లో గుండ్రంపల్లి విద్యార్థుల ఘనత
చిట్యాల,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన టీజీ సెట్ 2025 ఫలితాల్లో చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ ప్రవేశ పరీక్షలో గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత సాధించి, వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ దోర్నాల శివ తెలిపారు.
గురుకుల పాఠశాలలకు ఎంపికైన వారిలో కోయగుర శివ చరణ్, బోడిగే ఉపేక్ష, కంకల శ్రేష్టి, జోగు గహణ మారగోని అక్షర, అరిగెల నిఖిల్, ఉయ్యాల నిహల్, సుక్క అశ్విత, కళ్లెం మోక్షిత్, నమ్ముల నిషిత్, కోయగుర శ్రీలేఖ, బొడిగె సాన్వి, మైల సాహితి,రాచకొండ మౌర్య, పగడాల సాయి, చైతన్య ఉన్నారు ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ దోర్నాల శివ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.




