జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మహాజనసభ
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో హనుమకొండ జిల్లా కలెక్టర్, బ్యాంకు బాధ్యతల ఇన్‌చార్జ్ చాహత్ బాజ్ ఫాయ్ అధ్యక్షతన మహాజనసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్ సేకరణ, రుణవితరణలో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తూ, లాభాల దిశగా ముందుకు సాగుతున్నదని తెలిపారు.
రైతులకు, సహకార సంఘాలకు సమయానికి రుణాలు అందజేసి వ్యవసాయ అభివృద్ధికి బ్యాంకు కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. పాక్స్ యాక్సిలరేటరీ కార్యక్రమం కింద నాబార్డ్ సహకారంతో నాలుగు సహకార సంఘాలకు డ్రోన్లు, జనౌషధి కేంద్రాల స్థాపనకు తక్కువ వడ్డీపై రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇదే మార్గంలో ఇతర సంఘాలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు రావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారులు సంజీవరెడ్డి, నీరజ, వాల్య నాయక్, కోదండ రాములు, వరలక్ష్మి, రామ్మోహన్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు, తోటపంటల శాఖ, మత్స్యశాఖ అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహక అధికారి వజీర్ సుల్తాన్, ప్రధాన మేనేజర్ ఉషశ్రీ, ఉప ప్రధాన మేనేజర్ అశోక్, బ్యాంకు ప్రత్యేక విధుల అధికారి విజయ కుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




