25 March, 2026 | 10:46 PM

కాసిపేట మండలంలో యువతిపై దాడి

25-03-2026 09:23 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామంలో ఓ మహిళపై ప్రేమ వివాహం విషయంలో తలెత్తిన విభేదాలు దాడికి దారితీసిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం... రొట్టపల్లి గ్రామానికి చెందిన పోగుల అక్షిత్ కుమార్, అదే గ్రామానికి చెందిన అలక అక్షిత ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయా రు. రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారునీ సమాచారం.. దీన్ని మనసులో పెట్టుకొని అక్షిత్ కుమార్ సోదరి సదాపై అమ్మాయి అలక పెద్దులు, రాజు, ప్రశాంత్ వారి బందువులు కలిసి దాడి చేసి కొట్టారు. ఈ సంఘటనలో గాయపడిన సదాను హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.