25 March, 2026 | 11:25 PM

ఫోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

25-03-2026 09:46 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఫోక్సో కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు, నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల శేఖర్ 25 సంవత్సరాలు  అనే వ్యక్తి 2023 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేయగా అతనిపై 2023 సంవత్సరంలో నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు అవ్వగా, ఇట్టి కేసును అప్పటి డి ఎస్పీ జగన్నాథ్ రెడ్డి దర్యాప్తు చేసి, ఛార్జ్ షీట్ నమోదు చేశారు.కేసును కే.శేషు పబ్లిక్ ప్రాసెక్యూటర్ కోర్ట్ నందు వాదించగా  కామారెడ్డి జిల్లా కోర్టు జడ్జి వరప్రసాద్, శేఖర్ కు 20 సంవత్సరాల కఠిన కారాగారా శిక్ష 30,000/- రూపాయలు జరిమానా విధించినట్లు అయన తెలిపారు.