25 March, 2026 | 9:34 PM

అక్రమ ఇసుక నిల్వలు సీజ్

25-03-2026 08:11 PM

* మంజీరా నుంచి ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు

పాపన్నపేట: పాపన్నపేట మండలం గాంధారిపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 30 ట్రాక్టర్ల ఇసుకను బుధవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆర్ఐ సత్తు స్వామి, మంజుల క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి మంజీరా నుంచి అక్రమంగ ఇసుక తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.