25 March, 2026 | 11:04 PM

పెన్షనర్ల హక్కులను హరించే చట్టాలను వెంటనే రద్దు చేయాలి

25-03-2026 08:51 PM

గరిడేపల్లి,(విజయకాంతి): పెన్షనర్ల హక్కులను హరించే వాలిడేషన్ చట్టం 2025 ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గరిడేపల్లి మండల కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో తాసిల్దార్ స్రవంతికి బుధవారం వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సుందరి నాగయ్య మాట్లాడుతూ... ఈ చట్టం అమల్లోకి వస్తే 2026 జనవరి ఒకటికి ముందు పదవి విరమణ పొందిన వారిని

ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేరువేరుగా విభజించి వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం పలు అనుమానాలకు దారితీస్తుంది అన్నారు.ఇది దాదాపు 54 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందించిన పెన్షనర్లకు తీవ్ర అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పెన్షనర్ల హక్కులను కాలరాసే ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారికి న్యాయం చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.పెన్షనర్ల సంక్షేమం కాపాడాలని వారి హక్కులను భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని వెంటనే ప్రభుత్వ స్పందించాలని సంఘ నేతలు విజ్ఞప్తి చేశారు.