తప్పిపోయిన బాలుడి అప్పగింత
25-03-2026 08:17 PM
బైంసా,(విజయక్రాంతి): నర్సాపూర్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన వారంతా సంతలో నాలుగేళ్ల బాలుడు తప్పిపోయారు. సంతలో ఒంటరిగా ఏడుస్తున్న బాలుడిని గుర్తించిన నారి శక్తి మహిళా పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రుల కోసం వెతికిన దొరకలేదు. వెంటనే ఆ బాలుని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అన్నం తినిపించి బిస్కెట్లు ఇచ్చి ఊరు పేరు అడగగా గొల్లపేట్ చెప్పడంతో వారు అక్కడికి సమాచారాన్ని అందించారు. తప్పిపోయిన తల్లి ఈ విషయాన్ని తెలుసుకొని పోలీస్ స్టేషన్ వెళ్లగా బాలుని అప్పగించారు. బాలుడుని అప్పగించిన కానిస్టేబుల్ లకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.




