30 March, 2026 | 3:47 AM

కులగణనలో బీసీలను లెక్కించాలి

30-03-2026 02:16 AM

మిర్యాలగూడ, మార్చి 29 : కుక్కలకు,బర్రెలకు,పులులకు, మిగతా జంతువులకు లెక్కలు ఉంటాయి కానీ బీసీలకు ఉండవా అని బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ ప్రశ్నించారు. ఆదివారం  మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై ఆయన  మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఈసారీ జరిగే జాతీయ జనగణలో సమగ్ర కులగణన చేపడుతామని నిర్ణయించడం అభినందనీయమన్నారు.

కేంద్ర ప్రభుత్వం రెండు దఫాలుగా జరుపుతున్న జనగణనలో మొదటి దపా జరిగే కుటుంబాల లెక్కింపులో ఎస్సీ,ఎస్టీ కుటుంబాలను లెక్కిస్తు,బీసీ కుటుంబాలను మాత్రం ఎందుకు లెక్కించడం లేదని శ్యామ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.బీసీ కుటుంబాలను లెక్కిస్తేనే భవిష్యత్తులో బీసీ సమగ్ర కులగణన డేటా సంపూర్ణంగా మొదటిసారిగా అధికారికంగా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ఏప్రిల్ నెల నుంచి ప్రారంభమయ్యే కుటుంబాల లెక్కింపు కోసం జరిగే 33 కాలంలో తోపాటు 34వ కాలంగా ఓబీసీ కుటుంబాలను కూడా చేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్, బీసీ యువజన పట్టణ అధ్యక్షులు దోనేటి శేఖర్ బీసీ యువజన నాయకులు మందుల విజయ్ కుమార్ కురుమ, ఆదే యాదగిరి కురుమ నల్ల రమేష్, నల్ల సాయి,  గణం శివ కుందే మహేష్ బర్ల సురేష్ కుందే సందీప్ కుందే శివకుమార్ నరేష్మహేష్ అశోక్ కృష్ణ శ్రీకాంత్, సాయి సంతోష్, నర్రి నరేష్ గణం సతీష్ గనం సాయి తదితరులు పాల్గొన్నారు.