5 August, 2026 | 2:45 AM

ఒకటో తేదీనే జీతాలు.. సుపరిపాలనకు నిదర్శనం

05-08-2026 01:56 AM

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గెస్ట్ జూనియర్ లెక్చరర్ల పాలాభిషేకం

గజ్వేల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందించడం రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనకు నిదర్శనమని గెస్ట్ జూనియర్ లెక్చరర్లు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గెస్ట్ జూనియర్ లెక్చరర్లు మంగళవారం పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా గెస్ట్ జూనియర్ లెక్చరర్ల రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ నవాజుద్దీన్ మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తన నిబద్ధతను చాటుకుంటోందన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించే అవకాశం కలుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, బోధన సిబ్బంది,  జిల్లా నాయకులు రామస్వామి, లతశ్రీ, భాను తదితరులు పాల్గొన్నారు.