calender_icon.png 7 February, 2026 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతపై రైతుల ఆందోళన

07-02-2026 12:26:15 AM

చివ్వెంల, ఫిబ్రవరి 6 : జాతీయ రహదారి ఎన్హెచ్365కు అతి సమీపంలోనే దొంగలు రెచ్చిపోవడం చివ్వెంల మండలంలో భద్రతపై తీవ్ర సందేహాలు కలిగిస్తోంది. మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామం వద్ద అమరగాని ఆంజనేయులు కు చెందిన వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లోని విలువైన పనిముట్లు గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ ఎత్తుకెళ్లారు.

ఈ ఘటనలో రైతులకు అత్యంత అవసరమైన స్టార్టర్ పెట్టెలు, విద్యుత్ వైర్లు దొంగిలించడంతో సాగు పనులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఈ దొంగతనం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రహదారి పక్కనే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దొంగలు ఇప్పటివరకు పట్టుబడకపోవడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.రాత్రి వేళ పహారా ఏర్పాటు చేయాలని, పోలీస్ గస్తీని పెంచాలని, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.