14 July, 2026 | 4:38 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

27-04-2026 01:09 AM

హాజరైన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ 26: అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధి కోహెడ గ్రామంలో వెలసిన శ్రీ మహాదేవ్ దేవస్థాన (ఆంజనేయ స్వామి) నూతన ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఎంపీకి ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చామల కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగాలని, భక్తిభావం వల్ల సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ, సహకారం ఎల్లప్పుడూ ఉంటాయని  ఆయన తెలపారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.