26 April, 2026 | 9:35 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కన్నారెడ్డి జీపీ భవనానికి భూమి పూజ

24-01-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, జనవరి 23 (విజయ క్రాంతి): మండలంలోని కన్నా రెడ్డి గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణంకు భూమి పూజ చేసినట్లు గ్రామ సర్పంచ్ సాయిలు తెలిపారు. తాండూరు గ్రామానికి చెందిన రాజిరెడ్డి జిపి నిర్మాణం కొరకు భూమిని దానంగా ఇచ్చినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ దాత రాజిరెడ్డి గ్రామ సర్పంచ్ సాయిలు కలిసి భూమి పూజ చేశారు.

జిపి నిర్మాణం కొరకు భూమిని దానంగా ఇచ్చినందుకు గ్రామస్తులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు. గ్రామ సర్పంచ్ పామగళ్ల సాయిలు, టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిబాబా, ధర్మరెడ్డి సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ, రాఘవపల్లి గ్రామ సర్పంచ్ నార్ల గంగమ్మని మల్లేష్, పల్లెబోగుడు తండా సర్పంచ్ బాల్య నాయక్, బంజర తండ సర్పంచ్ సురేష్, ఫీల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.