11 April, 2026 | 8:00 PM

కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వము అడుగులు

11-04-2026 06:01 PM

రూ.8.90 కోట్లతో ఇండోర్ స్టేడియంగా అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాను క్రీడల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంద అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో రూ.8.90 కోట్లతో ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులను, ప్రతిపాదిత ఇండోర్ స్టేడియం స్థలాన్ని వరిశీలించి పనులను ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ  పనులు నాణ్యతతో వేగవంతంగా చేపట్టాలని సూచించారు.

 ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. 8 కోట్ల 90 లక్షలను కేటాయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కామారెడ్డి క్రీడా రంగంలో విశిష్ట స్థానం సంపాదించనుందని పేర్కొన్నారు. స్టేడియంలో  ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల రన్నింగ్ ట్రాక్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ,విశాలమైన గ్యాలరీలు, అత్యాధునిక ఇండోర్ స్టేడియం,ఆధునిక జిమ్, రైఫిల్ షూటింగ్ రేంజ్, వాలీబాల్ కోర్టు,టెన్నిస్ కోర్టు,టేబుల్ టెన్నిస్, సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రితో చర్చించి భవిష్యత్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని కూడా చేపడతామని షబ్బీర్ అలీ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు క్రీడలను విస్మరించాయి అని అన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం యువత ప్రతిభను వెలికితీయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. గ్రామీణ క్రీడాకారులు ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై మెరవడం మా లక్ష్యం అని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.నిధుల మంజూరు ప్రక్రియ పూర్తయింది.పనులు ప్రారంభమయ్యాయి అని తెలిపారు.ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారన్నారు.

స్టేడియం పూర్తయిన తరువాత ఇతర జిల్లాల నుంచి క్రీడాకారులు శిక్షణ పొందేందుకు రావడమే కాకుండా, జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించే అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టంగాతెలియజేస్తున్నాము.కామారెడ్డి పట్టణ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలు మారనున్నాయనే వార్తతో స్థానిక క్రీడాకారులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ జిల్లాలో క్రీడా వికాసానికి నూతన దిశను నిర్దేశించనుందన్నారు.